Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 'మై నేమ్ ఈజ్ శతి'. (ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక). హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి డి.శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్ర టీజర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. క్రైమ్‌కి సంబంధించిన మెసేజ్ ఓరియెంటెడ్ వంటి మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు' అని చెప్పారు.
'ఈ చిత్రం అందర్నీ కచ్చితంగా మెప్పిస్తుంది' అని హీరోయిన్ హన్సిక అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ,'చిన్న సినిమా తీద్దామని ఓ టిపికల్ పాయింట్‌ను తీసుకుని నిర్మాతకు ఈ కథ చెప్పిన వెంటనే, రిస్క్ అయినా ఫర్వాలేదు ఈ సినిమా చేద్దామంటూ సినిమాకు కావలసిన పెద్ద ప్యాడింగ్ ఇచ్చి, పెద్ద సినిమా చేద్దామని నిర్మాత సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది' అని తెలిపారు. 'హన్సిక ఉండే ఏరియాలో కంటోన్మెంట్ జోన్ ఉన్నా కూడా తను రావడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొంది అనేది ఈ చిత్ర కథాంశం. టిప్స్ ద్వారా ఆడియోని రిలీజ్ చేస్తాం. అలాగే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని నిర్మాత ప్రభాకర్ గౌడ్ చెప్పారు.