Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.వి.జి.మూవీజ్తో కలిసి రెబెల్ నేషన్ పతాకంపై రూపొందుతున్న విభిన్న ప్రేమకథా చిత్రం 'ఆరాధన'. వశిష్ట పార్థసారధిని దర్శకుడిగా, పథీ¸్వరాజ్ని హీరోగా, తాను నిర్మాతగా పరిచయం అవుతూ రవికిరణ్ నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) ఈ చిత్రానికి మరో నిర్మాత. శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్మాత, రెబెల్ నేషన్ అధినేత రవికిరణ్ మాట్లాడుతూ, 'సినిమా చూసిన ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా హద్యమైన ప్రేమకథగా అభివర్ణించేంత గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మా దర్శకుడు వశిష్ట పార్థసారధి కషి చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ చేశాం. అధిక భాగం షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని అత్యద్భుత లొకేషన్స్‌లో జరుపుతాం' అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, సంగీతం: హరి గౌర, ఛాయాగ్రహణం: వేణు కొత్తకోట, నిర్మాతలు: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-రవికిరణ్, రచన-దర్శకత్వం: వశిష్ట పార్థసారధి.