Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'థియేటర్లలో టిక్కెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు, అదే టిక్కెట్ రేట్లను తగ్గించే అవకాశం ఏపీ ప్రభుత్వానికి కూడా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి' అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
గత కొద్దిరోజులుగా థియేటర్లు, టిక్కెట్ల ధరలు, పెద్ద సినిమాలు ఆగిపోవడం వంటివాటిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బుధవారం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై స్పందించారు.
ఆయన మాట్లాడుతూ, 'పరిశ్రమలో ఏ సమస్య ఉన్నా ముందు మీడియా సమన్వయం పాటించాలి. సంబంధంలేని వ్యక్తులతో చర్చాగోష్టిలు జరపడం వల్ల, సమస్యకి పరిష్కారం లభించకపోగా మరింత జటిలమవుతుంది. దీనికి మీడియా జవాబుదారితనం వహించాలి. సినిమా సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేసే హక్కు కేవలం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కే ఉంది. కోర్టు ద్వారా ఎంపిక చేసిన ఛాంబర్‌లోని కొంత మంది సభ్యులు ఎ.పి. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఇండిస్టీకి పెద్ద దిక్కు ఛాంబర్ మాత్రమే. అదే ఈ సమస్యలను పరిష్కరించగలదు. ఆంధ్రాలో 10, 5 రూపాయలు టికెట్ పెడితే అది తప్పని చెప్పాం. 40 రూపాయలు చేయాలని మెమొరాండం ఇచ్చాం. ఇటీవల జరిగిన మీటింగ్‌లో కూడా చర్చించాం. త్వరలో మరో మీటింగ్ జరిగి, సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉంది. ఇక పెద్ద సినిమాలు వాయిదా పడటం అనేది కేవలం కరోనా థర్డ్ వేవ్ వల్లనే. అవి పాన్ ఇండియాలు సినిమాలు కాబట్టి, పెట్టిన కోట్ల రూపాయలు పెట్టుబడి రావాలంటే సాధ్యం కాదు. అందుకే వాయిదా వేసుకున్నారు. అంతే తప్ప ఏపీ టిక్కెట్ రేట్లకు, పెద్ద సినిమాల వాయిదాకు ఎటువంటి సంబంధంలేదు. ఇటీవల ఓ రాజకీయనాయకుడు సినిమావారిని నిందించటం ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడ అందరూ దైర్యవంతులే, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. అంతేకానీ మీలా రెచ్చగొట్టే ధోరణి మాది కాదు' అని అన్నారు.