Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'బంగార్రాజు'. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. దీనికి నాగార్జున నిర్మాత. సంక్రాంతి సందర్భంగా నేడు (శుక్రవారం) ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో హీరో నాగార్జున గురువారం మీడియాతో ముచ్చటించారు. ''సోగ్గాడే చిన్ని నాయన'లో యూత్ బంగా ర్రాజుని మిస్ అయ్యాం. ఆ సినిమా నచ్చిన వాళ్లు కచ్చితంగా చిన్న బంగార్రాజును చూడాలను కుంటారు. అందుకే ఈ సినిమాని ఎంతో బాధ్యతగా చేశాం. నా బాడీ లాంగ్వేజ్ కోసం 'సోగ్గాడే..' సినిమాను చూడమని చైతూకి సలహా ఇచ్చాను. సీనియర్ బంగార్రాజు ఆత్మ లోపలకి ఎంట్రీ అయ్యాక, బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ మారుతుంది. దాని కోసం చైతూ డైలాగ్స్ అన్నీ నేను రికార్డ్ చేసి ఇచ్చేవాడిని. వాటిని చూసుకుంటూ చైతూ ఫాలో అయ్యాడు. ఈ సినిమాలో చిన్న బంగార్రాజుగా చైతూని చూసి సర్ప్రైజ్ అవుతారు. 'లవ్ స్టోరీ', 'మజిలీ' చిత్రాల తర్వాత ఇందులో ఉన్నది చైతూనేనా? అని ఆశ్చర్యపోతారు. రమ్యకష్ణది, నాది గోల్డెన్ కాంబినేషన్. మాకు ఒకరి గురించి ఇంకొకరికి బాగా తెలుసు. మా కెమీస్ట్రీ బాగుంటుంది. దర్శకుడు కళ్యాణ్ కష్ణ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన రాసిన పాట కూడా ఇంకా ట్రెండింగ్లోనే ఉంది. మాకు సంగీత దర్శకుడు అనూప్ ఎంతో స్పెషల్. 'సోగ్గాడే..' కంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సంక్రాంతికి పట్టుపట్టి వచ్చాం. ఈ చిత్రం బాగా ఆడుతుందని, మంచి నంబర్స్ వస్తాయని నమ్మకంగా ఉన్నాం' అని నాగార్జున తెలిపారు.