Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'రౌడీ బార్సు'. ఈ చిత్రంతో హీరోగా ఆశిష్ (శిరీష్ తనయుడు) పరిచయం అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా నేడు (శుక్రవారం) ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్బంగా హీరో ఆశిష్ మాట్లాడుతూ,'చిన్నప్పటి నుంచి డాన్సులు చేసేవాడిని. ఫ్యామిలీ ఈవెంట్స్, పార్టీలలో డాన్సులు చేసేవాడిని. అల్లు అర్జున్ గారు నాకు స్ఫూర్తి. అందుకే డాన్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. అలాగే సత్యానంద్, భిక్షు గారి దగ్గర నటనలో శిక్షణ పొందాను. న్యూయార్క్‌లో ఫిలిం కోర్సుల చేశాను. 'కేరింత' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. 'రౌడీ బార్సు' ఇంజనీరింగ్ వర్సెస్ మెడికల్ స్టూడెంట్స్ కథ అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. నా ఏజ్ గ్రూప్ క్యారెక్టర్ కథ కావడంతో సులువుగా కథలోకి వెళ్లగలిగా. దర్శకుడు హర్షతో బాగా డిస్కస్ చేసేవాడిని. ముందు రోజే సీన్ పేపర్ తీసుకుని ప్రిపేర్ అయ్యేవాడిని. ట్రైలర్ చూశాక రెస్పాన్స్ బాగా వచ్చింది. ఈజ్‌తో చేస్తున్నావ్, కొత్త యాక్టర్లా చేయడం లేదని అందరూ అప్రిషియేట్ చేయటం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు కాశీతో 'సెల్ఫిష్' సినిమాని చేస్తున్నాను. 'రౌడీబార్సు' ఫలితంపై మంచి నమ్మకంతో ఉన్నా' అని చెప్పారు.
'చిన్నప్పట్నుంచి ఆశిష్ డాన్సులు బాగా చేసేవాడు. అప్పటి నుంచే మేం హీరో అనిపిలిచేవాళ్లం. అయితే హీరోగా ఎదగటం అంత సులువు కాదనీ కూడా చెప్పేవాళ్లం. నేను ప్రాక్టీస్ చేస్తా అనేవాడు. డాన్స్, నటన అన్నీ నేర్చుకుని 2018లో నేను రెడీ బాబారు ఏదైనా కథ ఉంటే చెప్పండన్నాడు. అలా ఆశిష్ జర్నీ స్టార్ట్ అయ్యింది. పెద్ద దర్శకుడితో లాంచింగ్ చేయవచు. నేను నా కెరీర్‌ని చిన్నగా స్టార్ట్ చేశాను. ఆర్టిస్టుకి ప్రేక్షకుల యాక్సెప్ట్ చేయడం కావాలి. అది కూడా కథలో కంటెంట్ ఉంటేనే జరుగుతుంది. అందుకే ఈ సినిమా తీశా. స్వతహాగా తనంతట తాను ఎదగాలని ఆశిస్తున్నా. ఇదొక యూత్‌ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్. సినిమా చూశాక మ్యూజిక్‌ని బాగా ఎంజారు చేస్తారు. దేవి పాటలకు నేను పిధా అయ్యాను. సినిమా చూశాక మళ్లీ వచ్చి పాటల్ని కచ్చితంగా వింటారు. అంత నమ్మకం ఉంది. కథ ప్రకారమే సినిమాలో 9 పాటలను పెట్టాం. ఇదొక ఒక మ్యూజికల్ ట్రీట్. చివరి 20 నిమిషాల్లో బ్యాక్ టు బ్యాక్ పాటలు వచ్చినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదు' అని నిర్మాత దిల్‌రాజు అన్నారు.