Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకరత్నగా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న డా|| దాసరి నారాయణరావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు ఆరంభం అయ్యాయి. 'దర్శకరత్న' పేరుతో ఆయన జీవితంలోని సంఘటనల సమాహారంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని ఇమేజ్ ఫిలింస్ పతాకంపై సీనియర్ దర్శకుడు ధవళసత్యం దర్వకత్వంలో తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ధవళసత్యం మాట్లాడుతూ, 'చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్హుకు ఎదిగి, రచయితగా, దర్శక, నిర్మాతగా ఎందరెందరికో మార్గదర్శకుడైన దాసరి గారితో నాకున్న విడదీయలేని అనుబంధం ఈ చిత్రం చేసేందుకు నన్ను పురిగొల్పింది' అని తెలిపారు. 'కరోనా మూడో వేవ్ రాకపోతే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ఆరంభించే వాళ్లం. జాతీయ స్థాయి నటుడు దాసరి గారి పాత్రను పోషిస్తారు. అలాగే దాసరి పద్మ పాత్రలో గుర్తింపు ఉన్న నటి నటిస్తారు. తెలుగు, హిందీ, తమిళంతో పాటు మరికొన్ని భాషల్లో దీన్ని నిర్మించి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. సీనియర్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు' అని నిర్మాత తాడివాక రమేష్ నాయుడు చెప్పారు.