Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమర్ నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'డెత్ గేమ్'. శ్రీ సాయినాధ క్రియేషన్స్ బ్యానర్ పై చేరన్ దర్శకత్వంలో కె.సి నూరి, రాజశేఖర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ చిత్ర టీజర్‌ను అగ్ర కథానాయకుడు నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'టీజర్ చూస్తుంటే చాలా కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారని అనిపిస్తోంది. టీజర్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా టాకీపార్ట్ కంప్లీట్ చేసి, మార్చిలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా ఈ సినిమా ఉంటుంది' అని దర్శకుడు చేరన్ చెప్పారు. హీరో అమర్ మాట్లాడుతూ, 'మా చిత్ర టీజర్‌ని రిలీజ్ చేసిన అక్కినేని నాగార్జునగారికి కృతజ్ఞతలు. మంచి కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. కాలకేయ ప్రభాకర్, ఆర్.జె.హేమంత్, అనంత్, సమ్మెట గాంధీ, కిరీటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : సునీల్, మ్యూజిక్ : మహి ఎమ్.ఎమ్, ఎడిటర్ : శివ బొడ్డు, మాటలు : శ్రీనివాస్ చింత, పాటలు : వరికుప్పల యాదగిరి.