Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్ స్టార్ కష్ణ మనవడు, మహేష్‌బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం నేడు (శనివారం) థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కష్ణ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. 'నేను సినిమా చూశాను. ఎక్కడా బోర్ కొట్టలేదు. సబ్జెక్ట్‌లో కొత్తదనం ఉంది. సినిమాని బాగా తీశారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. అశోక్ కొత్తవాడిగా ఎక్కడా అనిపించలేదు. ఫస్ట్ సీన్లో అశోక్ కౌబారులా కనిపిస్తాడు. నాకు 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా జ్ఞాపకం వచ్చింది. నేను నడిచినట్టుగానే నడిచాడు. నేను నటించిన స్టైల్లో నటించాడు. 'జుంబారే' పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. నా అభిమానులు, మహేష్ అభిమానులు ఈ సినిమాని చూసి అశోక్‌ను హీరోగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. పండుగ సీజన్లో వస్తున్న ఈ చిత్రాన్ని చూసి మీరంతా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను' అని వీడియోలో కృష్ణ పేర్కొన్నారు. హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, 'ఈ సినిమాని బాగానే చేశానని అనుకుంటున్నాను. ఆడియెన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారని భావిస్తున్నా. అనిల్ రావిపూడి గారితో చేసిన సీన్‌కు పగలబడి నవ్వాం. ఈ సినిమాతో అద్భుతమైన జర్నీ ఏర్పడింది' అని అన్నారు. 'హీరో సినిమాతో అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాను. అతన్ని హీరోగా అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. అశోక్ టాలెంట్ చూపించి, తనని తాను నిరూపించుకుంటాడనే నమ్మకం నాకుంది' అని నిర్మాత పద్మావతి గల్లా చెప్పారు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ, 'సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతోన్నాం. రెండేళ్లు కష్టపడి ఈ సినిమాని నిర్మించారు. పద్మావతి, ఆదిత్య ఇలా అందరూ చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది' అని తెలిపారు. 'పద్మావతి గారితో పని చేయడం ఇంట్లో అమ్మతో పని చేసినట్టుంది. సమీర్ రెడ్డి గారు ఇచ్చిన హాలీవుడ్ స్టాండర్ట్ విజువల్స్ ఈ సినిమాలో చూస్తారు. గిబ్రాన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇచ్చాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడికి ఈ సినిమాతో అవార్డ్ రావాల్సిందే. వెంకట్ అదిరిపోయే ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఇందులో మంచి హ్యూమర్ ఉంటుంది. దానికి నా రైటర్స్ ఠాగూర్, కళ్యాణ్ కారణం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి వీరంతా కారణం. సినిమా పట్ల అశోక్‌కి ఉన్న ప్రేమే ఈ సినిమా. సాలిడ్ హీరో తెలుగు పరిశ్రమకు రాబోతున్నాడని బల్లగుద్ది మరీ చెబుతున్నాను' అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అన్నారు.