Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చెన్నై 28', 'ది లూప్', 'మనకథ' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. తమిళంలో 'మన్మథలీలై', తెలుగులో 'మన్మథలీల' అనే టైటిల్స్‌ని ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇది వెంకట్ ప్రభుకు 10వ చిత్రం కావడం విశేషం. అందుకే 'వెంకట్ ప్రభు క్వికీ' అనే టాగ్ పెట్టారు.
'పిజ్జా 2' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా, సంయుక్త హెగ్డే, స్ప్మతి వెంకట్, రియా సుమన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో కమల్‌హాసన్, శింబు చిత్రాలు కూడా ఇదే టైటిల్‌తో విడుదలై, మంచి సక్సెస్ సాధించాయి. మరోసారి అదే టైటిల్‌తో వెంకట్ ప్రభు చేస్తున్న ఈ సినిమా సైతం మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందనే ఆశాభావాన్ని యూనిట్ వ్యక్తం చేసింది. రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై టి.మురుగానందం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : తమిళ్ ఎ అజగన్, సంగీతం : ప్రేమి అమరేన్, ఎడిటర్ : వెంకట్ రాజన్, కళ : ఉమేష్ జె కుమార్.