Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమ కనకాల టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకుడు. 'జయమ్మ.. చూసే జనం కళ్ళకి సూర్యకాంతమ్మ' అంటూ సాగే ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ని ఆదివారం అగ్ర దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన స్వరాలను సమకూర్చగా, శ్రీకష్ణ ఆలపించారు. ఫన్నీ విజువల్స్‌తో ఈ పాట అందర్నీ విశేషంగా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. త్వరలో సినిమాని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరా : అనూష్ కుమార్, ఎడిటర్: రవితేజ గిరిజాల, నిర్మాత: బలగ ప్రకాష్, సమర్పణ: శ్రీమతి. విజయ లక్ష్మి, కళ: ధను అంధ్లూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్ - అఖిల, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విజరు కుమార్ కలివరపు.