Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకష్ణ, కతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'బంగార్రాజు'. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై, విశేష ప్రేక్షకాదరణతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్‌గా నమోదు చేసుకుంది. తొలి రెండు రోజుల్లో 36 కోట్ల రూపాయల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లాక్‌బస్టర్ సక్సెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ, 'సంక్రాంతికి 'బంగార్రాజు'ను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనం. జనవరి 14న అనేది మాకు చాలా ప్రత్యేకమైన రోజు. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. అలాగే నాన్నగారి కోరిక మేరకు ప్రతి సంక్రాంత్రికి ఏదో ఒక సినిమాని విడుదల చేస్తూనే ఉన్నాం. నాన్నగారు చేసిన 'దసరా బుల్లోడు' జనవరి14న విడుదలై అప్పట్లో అఖండ విజయాన్ని సాధించింది. ఈ మా 'బంగార్రాజు' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కలెక్షన్ల పరంగా ఒక్కరోజులోనే 17.5 కోట్ల గ్రాస్ ఆంధ్ర, తెలంగాణ, ఓవర్‌సీస్ అంతా కలిపి వచ్చిందని చెప్పారు. రెండు రోజుల్లో వచ్చిన టోటల్ గ్రాస్ అక్షరాల 36 కోట్ల రూపాయలు' అని తెలిపారు.
'ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అందుకే ఇందులో నటించడం సవాల్‌గా అనిపించింది. గ్రామీణ నేపథ్యం, ఎన్జర్జిక్ పాత్రని నేనింత వరకు చేయలేదు. ఈ పాత్ర చేయడానికి దర్శకుడు కళ్యాణ్ కష్ణ చాలా సపోర్ట్ చేశాడు. 'రారండోరు వేడుక చూద్దాం' సినిమాతో ఆయన నన్ను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేస్తే, ఈ సినిమాతో మరింత దగ్గరికెళ్ళేలా చేశాడు' అని నాగచైతన్య చెప్పారు.
దర్శకుడు కళ్యాణ్ కష్ణ మాట్లాడుతూ, 'నాగార్జునతోపాటు టెక్నీషియన్స్ అంతా సినిమా సక్సెస్ కావాలని కష్టపడి పని చేశారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆడియోకి మరింత క్రేజ్ తెచ్చేలా చేశాడు' అని అన్నారు.
'ఈ సినిమా కథని పూర్తిగా ఓన్ చేసుకుని సందర్భానుసారంగా సంగీతం అందించాను. నేపథ్య సంగీతానికి బాగా పేరు వచ్చింది' అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పారు.