Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బంగార్రాజు'తో సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడిగా అందరి ప్రశంసలు సొంతం చేసుకున్న కళ్యాణ్ కష్ణ తన తదుపరి చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్లో చేయబోతున్నారు. స్టార్ హీరోలతో హై బడ్జెట్ ఎంటర్టైనర్లని నిర్మించడమే కాకుండా క్వాలిటీ కంటెంట్‌తో సినిమాలను నిర్మించి దక్షిణాదిన ప్రముఖ నిర్మాణ సంస్థల్లో స్టూడియో గ్రీన్ ఓ ప్రత్యేకతని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ, 'సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కష్ణతో మా బ్యానర్లో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అని అన్నారు.