Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రానికి 'అనగనగా ఒక రాజు' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌తోపాటు గ్లింప్స్‌ని చిత్ర బృందం సంక్రాంతి పండుగ నేపథ్యాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసింది. పాత్ర పరంగా పెళ్ళి నేపథ్యంలో హీరో నవీన్ పోలిశెట్టి చేస్తున్న హంగామాతో ఉన్న వీడియో గ్లింప్స్ ఆద్యంతం వినోదభరితంగా ఉండటం, అలాగే అగ్ర సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హీరో చేస్తున్న రచ్చకి పర్ఫెక్ట్ యాప్ట్‌గా ఉండటం విశేషం. వినోదమే పరమావధిగా నిర్మించబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య చెప్పారు. దీనికి సమర్పణ : పి.డి.వి.ప్రసాద్.