Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన సినిమా 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పద్మావతి గల్లా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై, ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి చిత్ర బృందం ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, 'తొలి రోజు దేవీ థియేటర్లో పాజటివ్‌గా స్పందించిన ప్రేక్షకుల తీరుని ఇంకా మర్చిపోలేకపోతున్నా. అందుకే సినిమా చూసి ఎంజారు చేస్తున్న ప్రేక్షకులకు కతజ్ఞతలు చెబుతున్నా' అని అన్నారు. జయదేవ్ గల్లా మాట్లాడుతూ, 'సమష్టి కషి వల్ల ఈ సినిమా విజయం సాధించింది. అందరి కష్టం మంచి ఫలితాన్ని ఇచ్చింది' అని తెలిపారు. 'నేను గత 15 ఏళ్ళుగా థియేటర్‌కు వెళ్ళలేదు. ఈ సినిమాకోసం వెళ్ళి చూశాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూసి ఎంజారు చేశాను. ఈ సినిమా చూశాక నేను చేసిన 'హనుమాన్ జంక్షన్' గుర్తొచ్చింది. ఇలాంటివి తీయాలంటే దర్శకుడు గొప్పతనం చూపించాలి. హీరో అశోక్‌లో తపన కనిపించింది' అని జగపతిబాబు అన్నారు.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ, 'థియేటర్లలో నిజమైన పండుగలా వుంది. నేను నాలుగు సినిమాలు చేసినా ఈ సినిమాకి వచ్చినంత స్పందన ఏ సినిమాకీ రాలేదు' అని చెప్పారు. నాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, 'శ్రీరామ్ ఆదిత్య స్టయిలిష్‌గా తీశారు. నా కుటుంబంతో సినిమా చూసి, ఎంజారు చేశాను. హీరోగా అశోక్‌ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. ఆయన మరిన్ని సినిమాలతో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారు' అని అన్నారు.