Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియదర్శి, ధన్యా బాలకష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 1' ఏంతో ప్రేక్షాదరణ పొందింది. ఆ హిట్ సిరీస్కు సీక్వెల్గా 'లూజర్ 2'ను తీసుకొస్తోంది. తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. 'లూజర్ 2'కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్. జీ5, అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్వర్క్క్ నిర్మించిన ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఈనెల 21న స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 'లూజర్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ, 'ఓటీటీ అనేది న్యూ రెవల్యూషన్. 'లూజర్' వెబ్ సిరీస్ ఆడియన్స్ని థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. 'లూజర్ 2' ట్రైలర్ కూడా చూశాను. ఇందులో ఉన్న కథ అందరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ నెల 21న వస్తున్న సీజన్ 3 టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా' అని చెప్పారు.
'జీ 5 అసోసియేషన్లో 'లూజర్' వెబ్ సిరీస్ చేసి, మళ్లీ ఇప్పుడు 'లూజర్ 2' చేయడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని నమ్మిన జీ5 ప్రసాద్ గారికి థ్యాంక్స్' అని నిర్మాత సుప్రియ అన్నారు. అక్కినేని అమల మాట్లాడుతూ,''లూజర్' సీజన్ వన్ చాలా బాగుంది. సీజన్ టుగా వస్తున్న 'లూజర్ 2' కూడా అంతకంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని తెలిపారు. దర్శకుడు అభిలాష్ మాట్లాడుతూ, 'ఈ కథకు భరత్, శ్రవణ్ ఇద్దరూ రైటింగ్లో ఫుల్ సపోర్ట్ చేశారు.నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్ డైరెక్ట్ చేశాడు. నటీనటులు, టెక్నికల్ టీమ్ అంతా బాగా సపోర్ట్ చేయడంతో ఈ సిరీస్ బాగా వచ్చింది' అని అన్నారు.
'మాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్లో నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోకు, సుప్రియ గారికి, జీ 5కు మా ధన్యవాదాలు' అని నటుడు ప్రియదర్శి చెప్పారు. జీ5 మార్కెటింగ్ డైరెక్టర్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ, 'అన్నపూర్ణ స్టూడియోలో మేము ప్రివిలేజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి 'లూజర్' సీజన్ 1 బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే 'లూజర్ 2'గా అదే స్థాయిలో అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.