Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలంగాణ దేవుడు' చిత్ర కథానాయకుడు జిషాన్ ఉస్మాన్ నిశ్చితార్థం హుస్నా ఫాతిమాతో సోమవారం హైదరాబాద్లోని ది వింటేజ్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ హోం మినిస్టర్ మహమ్మద్ అలీ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, 'తెలంగాణ దేవుడు' చిత్ర దర్శకుడు వడత్యా హరీష్తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ నిశ్చితార్థ మహోత్సవానికి హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించారు. తమ తనయుడిని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మహ్మద్ జాకీర్ ఉస్మాన్ ధన్యవాదాలు తెలిపారు.