Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్, దేవ కట్టా కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రేక్షకుల విశేష ఆదరణతో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసల్ని సైతం దక్కించుకుంది.
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్స్, న్యాయవ్యవస్థ మూడు గుర్రాలు. ఈ మూడు సక్రమంగా ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయ వ్యవస్థ తానే బలవంతమైన వ్యవస్థ అనుకుని, మిగిలిన రెండు వ్యవస్థలను కంట్రోల్ చేస్తే ఏవిధంగా వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని దర్శకుడు దేవ కట్టా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు.
థియేటర్లలో, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అందర్నీ అలరించిన ఈ చిత్రం ఈనెల 23 సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ, 'వ్యవస్థ మీద మనందరి మనుసులో ఉన్న మనోభావాలని ప్రతిబింబిస్తూ, నిజాన్ని నిర్భయంగా ఎలుగెత్తిన సినిమాగా 'రిపబ్లిక్' ఇప్పటికే ఎంతో మందిని ఒక ఉద్యమంలా ప్రభావితం చేసింది. అలాగే బుల్లితెర ప్రేక్షకుల్నీ ఈ చిత్రం మెస్మరైజ్ చేస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.