Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరోగా నా తొలి సినిమాకి మా నాన్నగారు (నట్టికుమార్) దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్‌ని మలుపు తిప్పే సినిమాగా 'వర్మ' మంచి విజయాన్ని సాధిస్తుందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నా' అని యువ కథానాయకుడు నట్టి క్రాంతి చెప్పారు.
నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌గా విశేష అనుభవం ఉన్న నట్టికుమార్ తనయుడు నట్టిక్రాంతి. ఆయన హీరోగా నటించిన సినిమా 'వర్మ'. వీడు తేడా అనేది ఉపశీర్షిక. ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నాయికలు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందించిన ఈ చితం ఈనెల 21న భారీగా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నట్టిక్రాంతి మంగళవారం మీడియాతో సంభాషించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
'నాకు దర్శకత్వం అంటే ఇష్టం. అందుకే కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ తర్వాత నిర్మాతగా కూడా నిలదొక్కుకోవాలని, న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాను. అక్కడ నేర్చుకున్న ప్రతీ అంశం ఈ సినిమాకి బాగా ఉపయోగపడ్డాయి. నటనలో వైజాగ్ సత్యానంద్‌గారి వద్ద ట్రైనింగ్ తీసుకున్నా. ఆయనకు ఈ సినిమా కథ తెలుసు. నీ బాడీ లాంగ్వేజ్‌కి సరైన కథ అంటూ ఆశీర్వదించారు. ఆ తర్వాత ట్రైలర్ చూశాక, మంచి భవిష్యత్ ఉందన్నారు. తొలి సినిమానే కొత్త ప్రయోగం చేయాలని చేశాను. ఇప్పుడు ఆడియన్స్ చాలా మెచ్చ్యూర్డ్గా ఉన్నారు. సాధారణ సినిమాలకంటే ఇలాంటి వైవిధ్యమైన కథలనే చూస్తున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ పరంగా చమక్ చంద్ర, శ్రీధర్‌తోపాటు నేను కూడా అలరిస్తాను. మంచి సినిమా చూశామన్న ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు. ఇటీవల సినిమా చూసిన కొంత మంది ప్రముఖులు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. 'టెంపర్' సినిమాకి క్లైమాక్స్‌లో ఎలా క్లాప్స్ పడ్డాయో ఈ సినిమాకీ పడతాయనే నమ్మకముంది.
నటుడిగా బాగా చేశానని అమ్మ, నా సోదరి మెచ్చుకోవడం మరింత బలాన్నిచ్చింది. నేను హీరోగా నటించిన ఈ సినిమా 21న విడుదల కావడం, అలాగే నేను నిర్మాతగా నిర్మించిన 'డిజె' చిత్రం ఈనెల 28న రిలీజ్ కానుండటం నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. నటుడిగా, నిర్మాతగా ప్రేక్షకులు నన్ను అదరిస్తారని ఆశిస్తున్నా' అని నట్టి క్రాంతి చెప్పారు.
'వర్మ' టైటిల్ వినగానే రామ్ గోపాల్ వర్మ గురించి అనుకుంటారు. కథకీ ఆయనకి సంబంధమే లేదు. కేవలం ప్రమోషన్ కోసం చేశాం. ఇదో థ్రిల్లర్ కథ. చక్కటి లవ్ స్టోరీ కూడా ఉంది. కథ ప్రకారం హీరో పేరు వర్మ. తను ఓ సైకో. అలాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది?, చివరికి ఏమైంది? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. చివరి అరగంట ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. హదయాల్ని కదిలించే సినిమా అని కచ్చితంగా చెప్పగలను.