Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం 'స్టాండప్ రాహుల్'. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం ద్వారా శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. మంగళవారం ఈ సినిమా నుంచి 'పదా..' అంటూ సాగే పాటను అగ్ర కథానాయిక రష్మిక మందన విడుదల చేశారు.
ఈ పాటకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మాట్లాడుతూ, 'రోడ్ ట్రిప్లో వెళ్తున్న నలుగురు స్నేహితులు, వాళ్ళల్లో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉన్నట్టు కనిపించడంతోపాటు విజువల్స్ అన్ని ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నాయి. రెహమాన్ రాసిన సాహిత్యం రాజ్ తరుణ్, వర్ష మధ్య ఉన్న ఇష్టాన్ని తెలియజేసేలా ఉంది. ఈ పాటకు స్వీకర్ అగస్తి మంచి మెలోడీ ట్యూన్ అందించారు. యాజిన్ నాజర్ గాత్రం చక్కగా కుదిరింది. జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి, స్టాండప్ కమెడియన్గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా' అని తెలిపారు.