Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'రావణాసుర'. సంక్రాంతి పండగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం స్టార్ట్ అయ్యింది. కీలక తారాగణంపై ఫైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. రవితేజ లాయర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌గా సుశాంత్ ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు.
అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈచిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు సినిమా ప్రారంభం రోజునే మేకర్స్ ప్రకటించడం విశేషం. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తుండగా, విజరు కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.