Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనూ రాయల్, మధు ప్రియ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ట్విస్ట్'. వెంకట్ దర్శకత్వంలో నిర్మాత సి.రంగ నాయకులు నిర్మించారు. సినీ పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా పరిసర ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్, లీడర్స్ చేతుల మీదుగా ఈ చిత్ర పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆటో యూనియన్ లీడర్స్ మాట్లాడుతూ,''ట్విస్ట్' చిత్ర బందానికి మా సహకారం, ప్రోత్సాహం ఉంటాయి. సినిమా విడుదలకు అందరం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం' అని తెలిపారు. 'మా చిత్ర పోస్టర్‌ను ఆటో యూనియన్ వారితో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌తో వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో అందరినీ థ్రిల్ చేస్తూ, ఆహా అనిపించేలా మా 'ట్విస్ట్' సినిమా ఉంటుంది. త్వరలోనే మా చిత్రాన్ని విడుదల చేస్తాం' అని నిర్మాత సి.రంగనాయకులు చెప్పారు.