Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఏలీన టుతేజా, రేష్మా బరి, నజియా ఖాన్, నిర్మల్ దిలీప్ రారు ముఖ్య పాత్రలు పోషించిన పాన్ ఇండియా చిత్రం 'ఫస్ గయే యారో' ('అబ్ ఆయేగీ కిస్కీ బారి?) అనేది ట్యాగ్‌లైన్. ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపేష్ డి.గోహిల్ నిర్మించిన ఈ హిలేరియస్ హర్రర్ ఎంటర్టైనర్కి యూసఫ్ సర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర బృందం ప్రసాద్ ల్యాబ్‌లో వైభవంగా ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించింది.
ప్రముఖ దర్శకుడు సయ్యద్ హుస్సేన్ సారధ్యంలో జరిగిన ఈ వేడుక ఆసాంతం పండగ వాతావరణాన్ని తలపించడం విశేషం. ఫస్ట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్తేకర్ షరీఫ్, తెలంగాణ స్టేట్ మైనారిటీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) ముఖ్య అతిథులుగా, నిర్మాతలు రూపేష్ డి.గోహిల్, ఎమ్.విజయలక్ష్మి, ఓం ప్రకాష్ భట్, ధనంజరు మాసూమ్, సహ నిర్మాత సోను గుప్తా, హీరో మస్త్ అలీ, దర్శకుడు యూసఫ్ సర్తి తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. డెక్కన్ (హైద్రాబాద్ హిందీ) సినిమాలకు రోజు, రోజుకు విపరీతమైన ఆదరణ పెరుగుతోందని, ఈ చిత్రాలకు రాయితీలిచ్చి ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ రాజశ్రీ ఫిల్మ్స్ ఈనెల 21న దేశ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.