Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రౌడీబార్సు'తో హీరోగా ఆశిష్‌కు చక్కటి శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది. నటన, డ్యాన్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్లో కూడా నటుడిగా అందర్ని ఆకట్టుకున్నాడని అందరూ ప్రశంసిస్తున్నారు' అని దిల్‌రాజు అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం 'రౌడీబార్సు'. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం నిర్మాత దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి చక్కటి స్పందన వస్తోంది. కథ, కథనాలు బాగున్నాయని, ఆశిష్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. యూత్ బాగా కనెక్ట్ అవుతుండటంతో కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. పండుగ తర్వాత కూడా వసూళ్లు తగ్గలేదు. ఐదు రోజుల్లో దాదాపు ఏడు కోట్ల గ్రాస్ వచ్చింది. నాలుగున్నర కోట్ల షేర్ లభించింది. మౌత్‌టాక్ చాలా బాగుంది. ఆంధ్రాలో చాలా చోట్ల హౌస్‌ఫుల్స్‌తో సినిమా ఆడుతోంది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. రెండో వారంలో కూడా ఇదే ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది. దేవిశ్రీప్రసాద్ పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. త్వరలో మ్యూజికల్ కంటెస్ట్ నిర్వహించబోతున్నాం. ఆశిష్ హీరోగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి 'సెల్ఫిష్' సినిమాను నిర్మించబోతున్నాం. సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సుకుమార్ డైలాగ్స్ రాస్తున్నారు. 'ఆర్య' తర్వాత నేను, సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది' అని చెప్పారు.