Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నటుడిగా 50 ఏండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి సుదీర్ఘ ప్రయాణం అరుదుగా జరుగుతుంటుంది' అని నరేష్ వీకే అన్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా నరేష్ మీడియాతో తన జర్నీ గురించి ముచ్చటించారు.
'నటుడిగానే కాకుండా మా విజయ కష్ణ మూవీస్ బ్యానర్‌ని స్థాపించి కూడా యాభై ఏళ్లు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది నుంచి మా నిర్మాణ సంస్థలో కొత్త సినిమాలను నిర్మించబోతున్నాం. 1972లో 'పండంటి కాపురం' సినిమాతో తెరంగేట్రం చేశా. ఇంత జర్నీ చేసేందుకు కారణమైన కష్ణ, విజయ నిర్మల, నా గురువు జంధ్యాల గారికి థ్యాంక్స్. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వచ్చినప్పుడు, ఎస్వీరంగారావు గారిని స్పూర్తిగా తీసుకున్నాను. సినిమా బిడ్డగా నేను కూడా పరిశ్రమకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందించబోతున్నా. ఈ ఏడాదితో అమ్మ పేరుతో స్టూడియోను అందిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని కష్ణగారు అభినందించారు. వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా సామాజిక సేవ చేశా. అలాగే 'మా' కోసం శ్రమించాను. ఈ ఏడాది కూడా మరిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకు వస్తున్నా. 'అంటే సుందరానికీ', 'అన్నీ మంచి శకునాలే', 'గని'తోపాటు వైష్ణవ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తున్నా. సినిమాలతోపాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ భిన్న పాత్రలు చేస్తున్నా. ఏ పాత్ర చేసినా ప్రేక్షకుల్ని అలరించడమే నా లక్ష్యం' అని చెప్పారు.