Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎఫ్3'. ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ నిర్మిస్తున్నారు. బుధవారం హీరో వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'ఎఫ్ 3' నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో వరుణ్ సరికొత్తగా కనిపిస్తున్నారు.
ఈ సినిమా అంతా డబ్బు చుట్టూ తిరుగుతుందని తాజాగా రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ పోస్టర్ సైతం చెప్పకనే చెబుతోంది. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
2019 సంక్రాంతి విన్నర్‌గా 'ఎఫ్ 2' నిలిచింది. ఈ సమ్మర్లో వినోదాల విందు చేసేందుకు 'ఎఫ్3' రాబోతోంది. సినిమా మీద అంచనాలు, పాజిటివ్ బజ్కు తగ్గట్టే అంచనాలను మించి ఈ సినిమా ఉండబోతోంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ హాస్యంతో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే మూడో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ సైతం ప్రేక్షకుల్ని కితకితలు పెట్టబోతున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ చిత్రానికి సమర్పణ: దిల్ రాజు, నిర్మాత: శిరీష్, కో-ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, కెమెరామెన్: సాయి శ్రీరామ్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్.కష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్, డైరెక్టర్: అనిల్ రావిపూడి.