Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజినీ రెడ్డి నిర్మాతగా చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'చరిత కామాక్షి'. నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'చిరు బిడియం..' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.
ఈ పాటకు విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో మేకర్స్ మాట్లాడుతూ, 'చిరు బిడియం..' పాటకి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. చక్కటి చీరకట్టులో, చూడగానే గౌరవం ఉట్టిపడే గృహిణిగా ఈ పాటలో చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు దివ్య శ్రీపాద. 'చరిత కామాక్షి' పాత్రలో ఆమె నటన కచ్చితంగా అలరిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి కూడా మంచి స్పందన లభించింది. దీంతో సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని తెలిపారు. మణికంఠ వారణాసి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: రజిని రెడ్డి, ఎడిటర్: కోడాటి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ: రాకీ వనమాలి, సంగీతం: అబూ, దర్శకుడు: స్త్రీలంక చందు సాయి.