Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన మహిళా ప్రధాన చిత్రం 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతత్వంలో ఎక్కువ మంది మహిళా సభ్యుల బందంతో రూపొందిన ఈ సినిమా నుంచి నేడు (శుక్రవారం) ఓ ఎగ్జైటింగ్ ఎనౌన్స్మెంట్ రానుందని చిత్ర బృందం ప్రకటించింది.
నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు.