Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్దిపేట రూరల్
జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి మామిండ్ల దశరథం గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ పంజా భాగ్యలక్ష్మి -బాలయ్య గారి సూచన మేరకు సిద్దిపేట రూరల్ మండలంలో మాచపూర్ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజలకు అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామం లోని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు . లేనిచో ఒమిక్రాన్ బారిన పడే అవకాశం ఉంది అన్నారు . కావున ప్రతిఒక్కరు మాస్క్ దరించి, జ్వర సర్వే కు సహకరించలని కోరారు . ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటూ తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని , శానిటైజర్ వాడాలని ప్రజలను కోరారు , రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సైతం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూ గ్రామస్థాయి అధికారులకు సైతం సూచనలు అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో, కార్యదర్శి, విద్యా సాగర్,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సారధి టీం లీడర్ జాగోరే రవి , కొమ్ము రవి, సానువాల కనకయ్య ,నీరటి రవి, కొమ్ము ఎల్లయ్య, యేల్పుల తిరుమలయ్య గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు .