Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా 'వర్జిన్ స్టోరి'. కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది ఈ సినిమా క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్. బి అట్లూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 3వ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఈ పాటను డైరెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. 'సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుంది అనే పాయింట్‌తో ప్రారంభం నుంచి చివరి వరకు ఎంజారు చేసేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత లగడపాటి శిరీషా శ్రీధర్ తెలిపారు.
సౌమికపాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అచ్చు రాజమణి, సినిమాటోగ్రఫీ : అనీష్ తరుణ్ కుమార్, ఎడిటర్ : గ్యారీ, సాహిత్యం : భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాఘవేంద్ర.