Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'రాజావారు రాణిగారు' ఫేమ్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, విద్యాసాగర్ చింతా డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి 'ఓ ఆడపిల్ల నువ్వర్ధం కావా..' అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'హీరో విశ్వక్ సేన్ పాత్ర అర్జున్ అని, తనకు ముప్పై ఏళ్లు అవుతున్నా పెళ్లి కావడం లేదని, జుట్టు ఊడి పోతుందని, పొట్ట వచ్చేస్తుందనే క్యారెక్టర్‌ను చక్కగా రివీల్ చేశారు. తనకు అమ్మాయి దొరికేసిందంటూ ఇటీవల ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌కీ మంచి స్పందన వచ్చింది. తాజాగా రిలీజైన పాటకూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది' అని మేకర్స్ తెలిపారు.