Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజయ్, వీర్తి వఘాని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'కొత్త కొత్తగా'. బి.జి. గోవిందరాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు. ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని 'డైమండ్ రాణి ..' అంటూ సాగే పాటను శుక్రవారం దర్శకుడు మారుతి ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
శేఖర్ చంద్ర సంగీతం దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి ఈపాటను ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన కొద్ది సేపటికే ఈ పాటకు మంచి స్పందన లభించడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.
'మంచి ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ఇటీవలే అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. అలాగే టీజర్ కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఇక లేటెస్ట్గా రిలీజ్ చేసిన 'డైమండ్ రాణి' పాటకి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. షూటింగ్ పూర్తి పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఆనంద్ (సీనియర్ హీరో), కాశీ విశ్వనాథ్, తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఎడిటర్: ప్రవీణ్ పూడి, కెమెరా : వెంకట్, కొరియోగ్రాఫర్: హరికిరణ్, ఫైట్ మాస్టర్: పధ్వీ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని, సాహిత్యం: కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, కష్ణ చైతన్య, శ్రీమణి.