Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేం తల్లిదండ్రులయ్యాం.. అంటూ బాలీవుడ్ స్టార్ కథానాయిక ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు శుభవార్త చెప్పి, అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ
సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులిద్దరూ ఓ పోస్ట్‌ని షేర్ చేశారు. 'సరోగసీ విధానంలో మేం పండండి బిడ్డకు జన్మనిచ్చాం. మాకెంతో సంతోషాన్నిచ్చిన ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సమయం మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే పుట్టింది మగ లేదా ఆడబిడ్డ అనే విషయాన్ని వీళ్ళు పోస్ట్‌లో ప్రస్తావించలేదు.