Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నాగ శౌర్య ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై అనీష్.ఆర్.కష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి 'కష్ణ వ్రింద విహారి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు.
''కష్ణ వ్రింద విహారి' అనే ఈ టైటిల్ ఎంతో ట్రెడిషనల్‌గా, కొత్తగా ఉంది. కష్ణ, వ్రింద అనేవి హీరో, హీరోయిన్ల పాత్రల పేర్లు అని టైటిల్ చెప్పకనే చెబుతోంది. నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా కనిపిస్తూ నాగశౌర్య అందర్నీ అలరిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే పెళ్లి తంతులా ఉంది. టైటిల్‌ని డిజైన్ చేసిన విధానం చాలా చక్కగా కుదిరిందని అందరూ ప్రశసింస్తున్నారు. ఇప్పటి వరకు నాగశౌర్య చేసిన పాత్రలన్నింటి కంటే ఈ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని వేరేచెప్పక్కర్లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షిర్లే సెటియా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటి రాధికతోపాటు వెన్నెల కిషోర్, రాహుల్ రామకష్ణ, సత్య, బ్రహ్మాజీ వంటి కమెడియన్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వారి క్యారెక్టర్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రానికి నిర్మాత: ఉషా మూల్పూరి, సమర్పణ: శంకర్ ప్రసాద్ మూల్పూరి,
కో ప్రొడ్యూసర్: బుజ్జి, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, దర్శకుడు: అనిష్.ఆర్.కష్ణ.