Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వి.ఆర్ .జి .ఆర్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 చిత్రంగా ఫిల్మీ గ్యాంగ్స్టర్స్ దర్శకత్వంలో ఒక హారర్ సినిమా, ప్రొడక్షన్ నెం: 2గా మహేష్ గంగిమళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న 'యూజ్ ఫుల్ ఫెలోస్' చిత్రాల పూజ కార్యక్రమాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ రెండు చిత్రాల హీరో, హీరోయిన్ల పై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అడిషనల్ సెక్రెటరీ కాళీ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ టి.చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు వి. వి.వినాయక్ మాట్లాడుతూ,'ఒకేసారి రెండు చిత్రాలు నిర్మిస్తూ, ఇద్దరు దర్శకులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. జి.వి.నాయుడు నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని అన్నారు. 'నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. దర్శకులు మహేష్ గంగిమళ్ల , ఫిల్మీ గ్యాంగస్టర్స్ టీం చెప్పిన కథలు నచ్చడంతో మా వి.ఆర్.జి.ర్ మూవీస్ పతాకంపై ఒకేసారి రెండు సినిమాలు నిర్మిస్తున్నాను. చాలా మంది కొత్త ఆర్టిస్టులను, టెక్నిషియన్లను ఇండిస్టీకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రెండు చిత్రాలకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాం' అని చిత్ర నిర్మాత జి.వి. నాయుడు చెప్పారు.