Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్ బాబు హీరోగా వెల్డింగ్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'బ్రిలియంట్ బాబు..సన్నాఫ్ తెనాలి'. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ కుమార్ చందక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన 'బ్రిలియంట్ బాబు..' పాట విశేష ఆదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక లేటెస్ట్గా విడుదల చేసిన
'బ్రిలియంట్ బాబు' పాటకి సైతం అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా డిఫెరెంట్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ అందర్నీ బాగా అలరిస్తున్నాయి. ఆ లొకేషన్స్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. పాటలో సంపూర్ణేష్ బాబు స్టెప్పులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో చాలా మంచి అప్లాజ్ దక్కించుకుంది. చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు' అని తెలిపింది. ఈ సినిమాకి శివరాం డైలాగ్స్ అందిస్తుండగా, డి.ఎస్.ఆర్. సంగీతం సమకూరుస్తున్నారు.