Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఊ అంటావా.. ఊహూ అంటావా..' స్పెషల్ సాంగ్ తర్వాత అగ్ర నాయిక సమంత మరో స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగల్ ఇచ్చిందని సమాచారం. కథానాయికగా తనకంటూ స్టార్ స్టేటస్ పొందిన సమంత 'ఊ అంటావా..' స్పెషల్ సాంగ్‌లో నటించి సర్ప్రైజ్ చేశారు. అల్లుఅర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
ఇందులోని 'ఊ అంటావా..' పాటలో సమంత మెరిసి, తనదైన హావభావాలు, స్టెపులతో ఫిదా చేశారు. లిరికల్‌గానే కాకుండా డాన్స్ పరంగా కూడా ఈ పాట అందర్నీ విశేషంగా అలరించడంతో యూ ట్యూబ్‌లో సైతం గ్లోబల్ నెంబర్ సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న పాటగా నిలిచి, సమంతకి సైతం జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు 'లైగర్' బృందం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ, పూరీజగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం తొలుత బాలీవుడ్ కథానాయికని తీసుకోవాలనుకున్నారు. అయితే 'పుష్ప'లోని 'ఊ..అంటావా' పాట సెన్సేషనల్ హిట్ కావడంతో, ఇందులో మెరిసి మాయ చేసిన సమంతని ఎంపిక చేసుకోవాలనే నిర్ణయానికి 'లైగర్' యూనిట్ వచ్చిందని, ఇందులో భాగంగా చిత్ర బృందం ఇప్పటికే ఈ విషయమై సమంతతో డిస్కస్ చేసిందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సమంత మరో స్పెషల్సాంగ్కి పచ్చజెండా ఊపిందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
సమంత ప్రస్తుతం గుణశేఖర్ 'శాకుంతలం', 'యశోద' సినిమాలతోపాటు ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నారు. ఓ పక్క నాయికగా పలు చిత్రాల్లో నటిస్తూనే, మరో పక్క స్పెషల్ సాంగ్స్‌తో సమంత మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది.