Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత నట్టికుమార్ తనయ నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'డిఎస్జె' '(దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం బాషలలో ఈ చిత్రాన్ని ఈనెల 28న థియేటర్లలో భారీగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కథానాయిక నట్టి కరుణ సోమవారం మీడియాతో ముచ్చటించారు.
'ఇది హైదరాబాద్లో జరిగిన వాస్తవ కథ. అది సెస్సేషన్ న్యూస్ రూపంలో వచ్చింది. కథనంలోని కొన్ని ట్విస్ట్లు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి. తొలి సినిమాలోనే నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రని, కథని ఎంచుకున్నా. ఈ సినిమా చేయడమే ఛాలెంజింగ్. యాక్షన్ బాగా అనిపించింది. ఈ కథలో కొంచెం లవ్ కూడా ఉంటుంది. దెయ్యంతో సహజీవనం చేసే క్రమంలో యాక్షన్, అరుపులతోపాటు మిడిల్ క్లాస్ అమ్మాయిగా మరో కోణం కూడా ఈ కథలో కనిపిస్తుంది. ఇందులో రెండు పాటలుంటాయి. నటన కంటే డాన్స్ చేయడం కష్టమనిపించింది. ఫైనల్ అవుట్ పుట్ చూసి, అందరూ మెచ్చుకున్నారు. మావారైతే నీకు కరెక్ట్ కథ అని కామెంట్ చేశారు (నవ్వుతూ). ఓ నటిగా నాకు ఈ సినిమా సంతప్తి నిచ్చింది. ఈ సినిమా తర్వాత కూడా లేడీ ఓరియెంటెడ్ పాత్రలే చేయాలనుకుంటున్నా. నటిగా డ్రీమ్ రోల్స్ అంటే విజయశాంతి తరహాలో పవర్ఫుల్ పాత్రలు చేయాలని ఉంది' అని నట్టి కరుణ తెలిపారు.