Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్న గుదిబండి వెంకట సాంబి రెడ్డి నిర్మాతగా మారి శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బ్యానర్‌ని స్థాపించారు. తొలి ప్రయత్నంగా అలీ హీరోగా 'పండుగాడి ఫొటో స్టూడియో' చిత్రాన్ని నిర్మించారు. మలి ప్రయత్నంగా మలయాళంలో ఘన విజయం సాధించిన 'పడి నెట్టం పడి' చిత్రాన్ని 'గ్యాంగ్స్ ఆఫ్ 18' పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శంకర్ రామకష్ణన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ''గ్యాంగ్స్ ఆఫ్ 18' టైటిల్‌కి నా స్కూల్ డేస్ అనే ట్యాగ్‌లైన్ పెట్టి, సినిమా కథేంటో చెప్పాం. స్టూడెంట్ ఫేజ్ గురించి ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించారు. విద్యార్థులకు సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది. జీవితంలో వాళ్లు ఏ స్థాయికి ఎదుగుతారనే చక్కటి సందేశం ఇందులో ఉంటుంది. ప్రభుత్వ కళాశాలకు చెందిన స్టూడెంట్స్ కార్పోరేట్ విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్‌కి ఏమాత్రం తీసిపోరు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఆచార్యుని పాత్రలో మమ్ముట్టి ఎక్స్‌లెంట్‌గా నటించారు. ఆయన తన స్టూడెంట్స్‌ని ఇన్స్పైర్ చేసే విధానంగాని, వారి అభివృద్ధికి తోడ్పడే అంశాలన్ని నిజ జీవితంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్‌తో పాటు తల్లిదండ్రులందరూ కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది. ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడు ఏహెచ్ కాశీఫ్ అద్భుతమైన ఐదు పాటలు కంపోజ్ చేశారు. సినిమాటోగ్రఫీ, దర్శకుడి టేకింగ్, నటీనటుల నటన, కెచ్చ ఫైట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చైతన్య ప్రసాద్, శ్రేష్ణ, కష్ణ మాదినేని పాటలు రాయగా, మైథిలి కిరణ్, దీపిక రావ్ సంభాషణలు సమకూర్చారు. క్వాలిటీలో ఎక్కడా రాజీపడకుండా దీన్ని స్ట్రయిట్ సినిమాలా తీర్చిదిద్దాం' అని చెప్పారు.