Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'డిజె టిల్లు'. విమల్ కష్ణ దర్శకుడు. తాజాగా ఈచిత్రం నుంచి 'రాజా రాజా ఐటెం రాజా..రోజ రోజ క్రేజీ రోజ..పటాస్ పిల్ల పటాస్ పిల్ల' అంటూ సాగే పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా, సంగీత దర్శకుడు గాయకుడు అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిపై చిత్రీకరించిన ఈ పాటకు విజరు బిన్ని నత్యాలను సమకూర్చారు. సాహిత్యం, స్వరం పోటీ పడిన ఈ పాటకు సామాజిక మాధ్యమాలలో సైతం మంచి స్పందన లభించడంపట్ల మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గీత రచయిత కిట్టు విస్సా ప్రగడ మాట్లాడుతూ, 'ఈ పాటలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో విమల్ నాకు కళ్ళకి కట్టినట్టు రాసి పంపారు. దాని వల్ల కొత్త రకం పోలికలు వాడటం సాధ్యపడింది. నేను శ్రీ చరణ్‌కి దాదాపు ముప్పై పాటల వరకూ రాశాను. అతనితో పని ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. ఈ కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే పాట మరో స్థాయికి వెళ్తుందని నమ్మకం కలిగింది. పాటలోని దశ్యాలన్నీ యువతను ఆకట్టుకునేవిగానే ఉన్నాయి' అని తెలిపారు.
వినోద ప్రధానంగా సాగే కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా దీన్ని సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.
ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: పి. డి. వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ.