Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ రొమ్-కామ్‌గా రూపొందుతున్న ఈ ఉమెన్ సెంట్రిక్ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్‌తో రూపొందిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం రిలీజ్ చేసింది.
'స్ఫూర్తిదాయకమైన కంటెంట్‌తో ట్రైలర్ ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. అన్ని కమర్షియల్ అంశాలను చేర్చి ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు నగేష్ కుకునూర్ తీర్చిదిద్దారు. చిరంతన్ దాస్ విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకర్షణీయంగా ఉన్నాయి. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. కీర్తి సురేష్ విలేజ్ బెల్లె అవతార్‌లో సూపర్ కూల్‌గా ఉంది. ఆమె ఈ పాత్రను చాలా ఈజ్‌తో చేసింది. ఆమె కోచ్‌గా జగపతిబాబు తనదైన నటనతో మెప్పించారు. ఆది పినిశెట్టి మంచి పాత్రలో కనిపించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు. నిర్మాత దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది' అని చిత్ర యూనిట్ చెప్పింది.