Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటిస్తున్న 28వ చిత్రం 'అంటే సుందరానికి..' వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.
'ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ సినిమా షూటింగ్ పూర్తయింది. 'అంటే సుందరానికి..' అంటూ సెట్స్‌లో చివరి రోజు తీసిన ఒక వీడియోను సోషల్‌మీడియా ద్వారా హీరో నాని షేర్ చేసుకున్నారు.
'నూతన సంవత్సరం సందర్భంగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్‌తో ఆశ్చర్యపరిచారు. ఫస్ట్ లుక్‌తోనే ఇదొక డిఫరెంట్ మూవీ అని కూడా చెప్పారు. కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అనేది పాత్ర పేరుతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేసేందుకు నాని సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది' అని చిత్ర బృందం తెలిపింది.
నదియ, హర్ష వర్ధన్, రాహుల్ రామకష్ణ, సుహాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై, సీఈఓ: చెర్రీ, సంగీతం: వివేక్ సాగర్, సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మి, ఎడిటర్: రవితేజ గిరిజల, ప్రొడక్షన్ డిజైన్: లత నాయుడు, రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.