Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మ కోసం అన్వేషిస్తున్న ఇద్దరి కూతుళ్ల కథే 'కళ్యాణం కమనీయం'. అలాగే తన పిల్లలను ఏనాటికైనా కలుసుకోవాలనుకునే ఓ అమ్మ వేదన ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. పేగు బంధానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఈ సీరియల్ ద్వారా ప్రముఖ గాయకుడు మనో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ఈ సీరియల్‌ను మీ అభిమాన జీ తెలుగు ఛానెల్లో ఈ నెల 31వ తేదీ రాత్రి 7:30 గంటలకు వీక్షించండి' అని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు.
'ఓ శరణాలయాన్ని నడుపుతున్న సీతారత్నం (హరిత)కి, ఫీజియోథెరపిస్ట్ చైత్ర (మేఘన లోకేష్)కి, తన తండ్రి (సింగర్ మనో)కి ఉన్న సంబంధం ఏంటి?, తండ్రి చెప్పిన ఆధారాలతో అమ్మ గురించి తెలుసుకున్న అక్కాచెల్లెళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమిటి?, వీళ్ళకీ రాక్ స్టార్ విరాజ్ (మధు)కి ఏంటి సంబంధం?, వీళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనే ఆసక్తికర అంశాలతో ఈ సీరియల్ రూపొందింది' అని మేకర్స్ చెప్పారు.