Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న సినిమాలతో, సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అదిత్ అరుణ్. ఆయన నటించిన 'వీకెండ్ లవ్', 'తుంగభద్ర', 'పీఎస్ వీ గరుడ వేగ', 'డియర్ మేఘ', 'డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ' వంటి తదితర చిత్రాలు ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా తన పేరును త్రిగుణ్‌గా మార్చుకుంటున్నట్లు అధికారికంగా అదిత్ ప్రకటించారు. త్రిగుణ్‌గా తొలిసారి రామ్ గోపాల్ వర్మ 'కొండా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని, ఈ సినిమా తనకెరీర్కి ఎంతో ప్లస్ అవుతుందని తెలిపారు.