Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇందులో నా మనసుకి బాగా నచ్చిన పాత్రను పోషిస్తున్నా. ప్రతి నటి ఇలాంటి పాత్రల్లో నటించాలని తపిస్తుంటారు. పైగా ఇలాంటివి చాలా అరుదుగా లభిస్తాయి. కథ, కథనంతోపాటు నా పాత్ర సైతం ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తాయి. ఇక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం మీ అందర్నీ మెస్మరైజ్ చేయటం ఖాయం.
- శ్రియా
గ్లామర్ పాత్రలతో పాటు భిన్న పాత్రలతోనూ శ్రియా అందర్నీ అలరిస్తున్నారు. ఎంచుకునే సినిమాలు సైతం అదే రీతిలో ఉండటం విశేషం. అలాగే ఓ పక్క 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలతోపాటు కంటెంట్ బాగుంటే వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రాల్లో సైతం నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె నటిస్తున్న నయా చిత్రం 'మ్యూజిక్ స్కూల్'. ఇళయరాజా సంగీత సారథ్యంలో రాబోతున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయింది.
'శర్మాన్ జోషి, శ్రియా శర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. కరోనా థర్డ్ వేవ్‌ను దష్టిలో ఉంచుకుని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణను నిర్వహించారు. దీని కోసం సపరేట్గా స్టూడియో, లొకేషన్లు అన్నింటిని కూడా శానిటైజ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సినిమాను పూర్తి చేసి, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని దర్శకుడు పాపరావు బియ్యాల ఎంతో కష్టపడి తెరకెక్కించారు. మేరీ డిక్రూజ్, మనోజ్ (శియా సరన్, శర్మాన్) పాత్రలు కళలు, సంగీతం, కల్చర్ వంటి వాటి మీద ప్రభావం చూపించేలా ఉంటాయి' అని చిత్ర యూనిట్ పేర్కొంది.
దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ, 'ఈ సినిమా రెండో షెడ్యూల్ అద్భుతంగా జరిగింది. ఇక ఈ మూడో షెడ్యూల్‌ను కొత్త ఏడాదిలో కొత్త ఎనర్జీతో ప్రారంభించాం. అలాగే అందరి రక్షణ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. శానిటైజేషన్ టీం మాత్రం ఈ షెడ్యూల్ జరిగినన్నీ రోజులు ఎంతో జాగ్రత్తగా అందరినీ చూసుకుంది' అని తెలిపారు.
యామినీ ఫిల్మ్స్ నిరిమస్తున్న ఈ సినిమాకి రచయిత, దర్శకుడు పాపా రావు బియ్యాల. హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడు. కిరణ్ దియోహన్స్ కెమెరామెన్. సుహాసిని ములై, ప్రకాష్ రాజ్, బెంజమిన్ గిలాని, శ్రీకాంత్ అయ్యంగార్, వినరు వర్మ, మోనా అంబెగోయెంకర్, గ్రేసీ గోస్వామి, ఒజు బరువా, బగ్స్ భార్గవ, మంగల భట్, ఫని ఎగ్గోటి, వక్వర్ షైక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.