Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి 'రంగ రంగ వైభవంగా'.. అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
''ఉప్పెన' సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బాపినీడు.బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్‌ని మెప్పించేలా టీజర్ ఉందని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య నడిచే బటర్ ఫ్లై కిస్ థియరీ కొత్తగా అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. 'అర్జున్ రెడ్డి' తమిళ వెర్షన్ డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా రూపొందుతున్న ఈ చిత్రానికి శామ్ దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.