Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'జయహో ఇండియన్స్'. ఆర్.రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'జయహో ఇండియన్స్' ఆంథమ్ విడుదలైంది. ఈ వీడియో సాంగ్‌కి సర్వత్రా అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, 'మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ విషయాన్ని స్పష్టంగా తెలిసేలా పోస్టర్లో హీరో లుక్‌ని దర్శక, నిర్మాతలు డిజైన్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన 'జయహో ఇండియన్స్' ఆంథమ్కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాటకు అన్ని చోట్ల నుంచి అనూహ్య స్పందన రావడంతో సినిమాపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. ఈ పాటలోని లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే దర్శక, నిర్మాతలు తెలియజేయనున్నారు' అని చెప్పారు.
రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముక్తార్ ఖాన్, నరసింహా రావు, రామరాజు, చిత్రం శ్రీను, అనంత్, టార్జాన్, గగన్ విహారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: ఆర్.రాజశేఖర్ రెడ్డి, నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్ళపల్లి, సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల, గాత్రం: యాజిన్ నిజార్, లిరిక్స్: కాసర్ల శ్యామ్, ఆర్ట్: మోహన్, నాగు.