Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సౌండ్ డిజైనర్‌గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి కథా రచయితగా, సంగీత దర్శకుడిగా, సినీ దర్శకుడిగా అంచె లంచెలుగా ఎదుగుతూ శేషు కె.ఎమ్.ఆర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్ క్రీమ్' రెండు చిత్రాలకు, 'అబ్ తక్ చెప్పన్ 2', '365 డేస్', 'ఎటాక్', సంపూర్ణేష్ బాబు నటించిన 'సింగం 123', మంచు విష్ణు నటించిన 'లక్కున్నోడు', 'మోసగాళ్లు' లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకి సంగీత దర్శకుడిగా, మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా, క్రియేటివ్ సౌండ్ డిజైనర్‌గా సత్తా చాటారు. '127 బి' హారర్ కామెడీ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి, ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్‌లతోపాటు ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
లేటెస్ట్గా 'కల' టైటిల్‌తో ఒక మధురమైన సాంగ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్లే బ్యాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శేషు కె.ఎమ్.ఆర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకి విశేష స్పందన లభించింది. ఈ పాటకు కవి సిద్ధార్థ సాహిత్యం అందించగా, నేహా కరోడి తన గాత్రంతో ప్రాణం పోశారు. భార్గవ్ రావడ విజువల్స్, నాయిక హీనా.ఎస్ అందం ఈ పాటకు మరింత వన్నె తెచ్చాయి. యూట్యూబ్‌లో ఈ పాట అందరి హదయాలను దోచేసి, ట్రెండింగ్‌లో ఉండటం ఓ విశేషమైతే, ఏ మాత్రం తెలుగు రాని, తెలియని ఓ పోలాండ్ పిల్లాడు జబీగ్స్ అలియాస్ బుజ్జి ఈ పాటని అద్భుతంగా పాడి, సామాజిక మాధ్యమంలో అందర్నీ అలరించడం మరో విశేషం.