Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ నటీనటులుగా వినరుబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సుందరాంగుడు'. ఏ.వి.సుబ్బారావు సమర్పణలో ఎమ్.ఎస్.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్ పతాకంపై చందర్‌గౌడ్, యం.యస్.కె. రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినూత్న ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఫిల్మ్ ఛాంబర్లో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సాయి రమేష్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కష్ణసాయి మాట్లాడుతూ,'ఇందులో 7 పాటలు ఉన్నాయి. అందులో ఒక డీజే సాంగ్ ఉంది. అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మాకున్న కష్ణ సాయి ఛారిటబుల్ ట్రస్టు తరఫున చాలామందికి సహాయం చేస్తున్నాం. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలను కూడా మా ట్రస్ట్ ద్వారా సహాయం కోసమే వినియోగిస్తాం. ఈ మధ్య సింగర్ జె.శ్రీనివాస్ పోయారు. వాళ్ల ఫ్యామిలీని కలిసి, మాకు తోచిన సాయం చేశాం. మా సినిమా సెన్సార్ పూర్తయి నాలుగు నెలలైంది. థియేటర్స్ దొరికినా వాటి రెంట్, క్యూబ్స్‌కు డబ్బు కట్టటానికి ఇబ్బంది పడుతున్నాం. మాకు సపోర్ట్ లేక సినిమా రిలీజ్ చేసుకోలేకపోతున్నా. మా సినిమా విడుదలకు సినీపెద్దలందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.