Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జేక్స్ బిజోరు సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని అమ్మ పాటను అఖిల్ అక్కినేని విడుదల చేసి, తన తల్లి అమల అక్కినేనికి అంకితం ఇచ్చారు. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మ గొప్పదనం చెప్పేందుకు సిరివెన్నెలగారు అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు. హదయాన్ని హత్తుకునేలా సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.