Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు లేటెస్ట్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట'. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ప్రేమికుల దినోత్సవం నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న 'సర్కారు వారి పాట' నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్.. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అద్భుతమైన ట్యూన్ అందించారు. వాలంటైన్స్ డేకి రిలీజయ్యే ఈ పాటను మహేష్ బాబు, కీర్తి సురేష్ పై రొమాంటిక్‌గా చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఈ చిత్రానికి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.